ఈ సైట్ వరల్డ్ మాప్ ని మాత్రమే కాకుండా మనం ఈ సైటును వీక్షిస్తున్నప్పటినుండి ప్రపంచంలో ఏ దేశంలో ఎంతమంది పుట్టారో ఎంతమంది చనిపొయారో ఇంకా ఎంత కార్బండైఆక్సైడు విడుదలయ్యిందో వివరాలు ఇస్తుంది.
వీటితో పాటుగా మీరు ఈ మాప్ మీది దేశాల మీద మౌస్ ఉంచితే ఆ దేశ జనభా మరియు ఆ దేశంలో ఒక సెకనుకు ఎంతమంది పుడతారో ఎంతమంది చనిపోతారో కూడా ఇస్తుంది.

సైట్ http://breathingearth.net/
గమనిక: వాయిస్ రాకుండా మ్యూట్ పెట్టుకోండి.
ముఖ్యంగా కార్బండైఆక్సైడు వివరాలు ఇస్తుంది, కొంచెం వింత వరల్డ్ మాప్ ఏ అయినా ఆసక్తికరమైన వివరాలని ఇస్తుంది కాబట్టి ఓసారి చూసేసి నచ్చిందో లేదో చెప్పండి మరి !!
చివరిగా, ఎదో ఒక కుగ్రామంలో ఒకరు పుట్టినా మరణించినా ఈ సైటు ఎలా అప్డేట్ చేస్తుంది? ఇంటర్నెట్లు లేని గ్రామాలు ప్రదేశాలు ఎన్నొ ఉన్నాయి కదా మరి, అని నాకు వచ్చిన ప్రశ్నలు మీకు కూడా వచ్చే ఉంటాయి. దీనికి సమధానం "ఈ వరల్డ్ మాప్ డాట సిమ్యులేషన్ మాత్రమే, అంటే నిజంగా జరిగే వాటికి నమూనా లాంటిది ".ఈ వివరాలు సైట్లో మాప్ కింద ఇచ్చారు.
భలే వుంది.. నేను ఈ మేప్ చూసేలోపు 600 మంది పుట్టేసారు :-))
ReplyDeletesite చూడంగానే noice తెగ వచ్చింది ఎందుకొచ్చిందో అర్ధం కాక చాలా తికమక పడిపోయి వైర్లు అన్ని పీకి మళ్ళీ పెట్టాను కాని noice తగ్గలేదు, అప్లికేషన్లు అన్నీ close చేసాను. చివరకు site sound stop చేస్తే ఆగిపోయింది. -దీనినే అంటారు పిల్లిని దగ్గర పెట్టుకుని ఊరంతా వెతకటం అంటే
ReplyDeleteమంచు పల్లకీ గారు ధన్యవాదములు :)
ReplyDeletek.karthik గారు హహ్హహ్హ :) అందుకే మ్యూట్ పెట్టమన్నాను :) , ధన్యవాదములు.