Thursday, January 14, 2010

సంక్రాంతి వర్షం !!!

సంక్రాంతి అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది మా ఇల్లు ఎందుకంటే మా అన్నయ్యలు వదినలు వారి పిల్లలు ఎక్కడున్నా ప్రతీ సంక్రాంతికి మాత్రం మా ఇంటికి వస్తారు,అందరము కలసి మా ఇంట్లోనే పండుగ జరుపుకుంటాం.


సంవత్సర్లో ఒక్క సారైనా అలా అందరూ కలుసుకుంటే భలే సందడిగా ఉంటుంది..ఆ అనుభవం వర్ణనాతీతం.

ఈసారి కూడా ఎప్పటిలాగానే అందరూ వచ్చారట...నేను ఇక్కడ ఉండడంతో వాళ్ళ హడావిడి,మాటలు అన్నీ ఫోన్లల్లో వినడమే !!

మా ఇల్లంతా అమ్మా నాన్న నలుగురు అన్నయ్యలు వదినలు వారి పిల్లలతో, పండుగవాతవరణంతో కళ కళ లాడుతుంది...అమ్మ అందరూ వచ్చేముందే అన్ని పిండి వంటలూ చేయించింది నేను రోజూ ఫోను చెయ్యగానే ఆదరాబాదరాగా వచ్చి ఫోను మాట్లాడే మా అమ్మ క్షణం తీరికలేకుండా అయిపొయింది..ఒకళ్ళతరువాత ఒకళ్ళు వదినలు అన్నయ్యలూ మాట్లాడుతుంటే పక్కన పిల్లల కేరింతలు అరుపులు..ఆహా నాకు పండుగ వాతావరణం కళ్ళ ఎదురుగా ఉన్నట్టు అనిపించింది...అందరూ నువ్వే లేవు అందరము వచ్చాము.. నువ్వు కూడా ఉంటే బావుండేది అన్నారు...  

భోగి రోజున పిల్లలందరినీ కూర్చో పెట్టి భోగిపళ్ళు పోసారు..  

పెద్దవదిన ఇద్దరి సహాయంతో భోగినాడు ఆవుపేడ నీళ్ళతో కల్లాపి చల్లించి చక్కగా ముగ్గులు వేయించి రంగులు దిద్దిందట....అనుకోకుండా ఆరోజు రాత్రే వర్షం, సరే కాని లెమ్మని మళ్ళీ మరునాడు కూడా కష్టపడి ముగ్గులు వేసింది రెండో రోజు కుడా జోరున వర్షం వచ్చిందట...ఆ వర్షానికి వేసిన ముగ్గులు రంగులతో సహా కొట్టుకుపోయాయి,పాపం ఉదయానికల్లా వాకిలి అంతా ఖాలీ ..ఇక అలసిపొయి వెయ్యలేదు..ఆ వాకిలి ఏమైనా చిన్నదా అంటే అదీ కాదు.వేసింది రాత్రి అవ్వడంతో వేసిన ముగ్గులను ఫొటోలు తీయడానికి కుడా లేకపోయింది:(

చలికాలంలో వర్షం ఏంటో నాకర్ధం కాలేదు..ఏదేమైతెనేం..అందరూ చక్కగా ఒకచోట ఉండి పండుగ చేసుకుంటున్నారు,నాకు చాలా సంతోషంగా ఉంది... 




ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని మనస్పూర్తిగా కోరుకుంటూ బ్లాగుమహాశయులకు, బ్లాగు వీక్షకులకూ, మీ కుటుంభ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

10 comments:

  1. కనుము పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మారుతి గారు సంక్రాంతి శుభాకాంక్షలు !!

    ReplyDelete
  3. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

    ReplyDelete
  4. మా యింట్లో కూడా పిల్లలు కష్టపడి భోగి రాత్రే వేసిన ముగ్గులు రంగులు అన్నీ సంక్రాంతి ఉదయమే కురిసిన వర్షానికి పాడయిపోయాయి. మీకు నా కనుమ శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు

    ReplyDelete
  7. అవునండి , ఈసారి వర్శం ఏమిటో ?
    మీకు కనుమ శుభాకాంక్శలు .

    ReplyDelete
  8. మారుతి గారూ !
    మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. కొంచెం ఆలస్యమయింది. క్షంతవ్యుణ్ణి.

    ReplyDelete
  9. nenu koodaa oka blog openchesi vunnanu anuklokundaga aa blog ku maaruti ane perupettanu aa tarvaata mee blog nu choodadam jarigindi. dayachesi mee blog perunu copy chesanu anukovaddu . yadruchikamga idi jarigindi.kaani mee blog anta andamga,baagaa nenu cheyyalenu naaku anbhavam ledu computerparignanam kooda takkuva --

    ReplyDelete
  10. msrmurty గారు నాకు తెలియజేసినందులకు ధన్యవాదములు !!

    ReplyDelete