





బాగా బోరు కొడుతున్నప్పుడు ఖాలీగా ఉన్న సమయంలో బొమ్మలు గీయడం అలవాటు.అంత అద్భుతంగా అయితే ఉండవు కాని చూడొచ్చు లెండి.నాన్న చాలా చక్కగా బొమ్మలు గీస్తారు.నేను హాస్టల్లో ఉండే రొజుల్లో నెలకొకసారి అమ్మ కాని నాన్న కాని వచ్చి చూసి వెళ్ళేవారు.నాన్నకు ప్రయాణాలంటే అస్సలు ఇష్టం లేదు అందుకే నా దగ్గరకు కూడా చాలా తక్కువగా వచ్చేవారు.నాన్న వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ తెల్లకాగితాల నోటుపుస్తకాలు పట్టుకొని ఉరుక్కుంటూ దగ్గరకు వచ్చేవారు.నాన్న వారిని కాగితం మీద ఎదో ఒక గీత గీయమనే వారు,ఏ పిచ్చిగీత గీసిన దాన్ని మరుక్షణంలో ఒక జంతువు బొమ్మలాగ మార్చి అద్భుతంగా గీసేవారు.
నాన్న లాగ బొమ్మలు గీయాలని ఉండేది,ఎందుకనో అంతగా నేర్చుకోలేకపోయాను. బోర్ కొడుతున్నపుడల్లా ఒకటే రకమైన బొమ్మలు అదీ మిక్కీ మౌస్,డొనాల్డ్ డక్ లాంటివి వేయడం అలవాటు అయ్యింది. అవైతే చాలా సులువుగ గీయొచ్చుకనుకనేమో :)
మొత్తానికి కింద నేను వేసిన బొమ్మలు ఎలా ఉన్నాయంటారు?


డ్రాయింగు పట్ల మీకు కూడా ఆసక్తి ఉన్నట్లైతే,ఇంట్లోనే మీకు మీరే నేర్చుకుందామని అనుకుంటున్నట్లైతే ఈ సైటు చూడండి,చాలా బాగుంది.5 స్టెప్పులలో పెంగ్విన్ ను గీయుట కూడా ఆ సైటులోనిదే....
good one
ReplyDeletetruly good...
ReplyDeletevery nice. mee jerry bomma adurs.
ReplyDeletenice one. mee jerry bomma adurs..
ReplyDeletechavakiran గారు, ROHAN గారు,budugu గారు ధన్యవాదములు.
ReplyDeleteI like your drawings. Beautiful. You are a good artist.
ReplyDeletesastry garu thank you !!
ReplyDelete