Tuesday, April 21, 2009

ధరిత్రీ దినోత్సవం- Earth Day !!


1962లో సెనెటర్ నెల్సన్ కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతవరణం కలుషితమవడం గమనించి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు నెల్సన్ ఒక నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నదే తడవుగా ప్రెసిడెంట్ కెన్నెడిని కలసి తన ఆలోచనను వివరించారు,దీని ప్రకారం ప్రెసిడెంట్ కెన్నెడి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు దేశమంతటా పర్యటించాల్సి ఉంటుంది.ఈ ఆలోచన నచ్చి కెన్నెడి పర్యటించేందుకు ఒప్పుకున్నారు.కాని ప్రెసిడెంట్ కెన్నెడి పర్యాటన సఫలీకృతం కాలేదు.ఎవ్వరూ ఈ సమస్య గూర్చి అంతగా పట్టించుకోలేదు.


1969లో సెనెటర్ నెల్సన్ కి మరొక ఆలోచన వచ్చింది.మన వాతవరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియచెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ తన మిత్రులకు మరియు ఒక వార్తా పత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు.

1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది.ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు.ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది.ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు 'ఎర్త్ డే నెట్‌వర్క్' ఏర్పడింది.

కేవలం ఒక సమస్యను అందరూ కలిసి పరిష్కరించుకోవాలని ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన, అందరినీ మన ధరిత్రి గూర్చి ఆలోచించి పోరాడేలా చేయగలిగిందంటే, ఇక అందరం కలిసి మన ధరిత్రిని గూర్చి ఆలోచిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో కదా!!


మీ వంతుగా మీరు ఏమి చెయ్యాలని ఆలోచిస్తున్నారా? ఐతే చదవండి !!

1.మీరు మొహం కడుక్కొనేటప్పుడు 2 నిమిషముల వరకూ నీళ్ళు వదిలేస్తుంటారా? ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు ఇలా చాలా పనుల్లో మనం అవసరమైన దాని కంటే ఎక్కువ నీళ్ళు వృధా చేస్తుంటాం.ఇప్పటినుండి నీళ్ళని ఆదా చెయ్యండి.

2.ఒకోసారి మీ పిల్లలను స్కూల్ నుండి తీసుకువచ్చేటప్పుడు ఇంక మరేదైన సందర్భాల్లో వారు వచ్చేదాక మీ కారు ఇంజనుని ఆన్ చేసే ఉంచుతారా?అది ఒక్క నిమిషమే అయితే పరవాలేదు,ఎక్కువ సమయం ఐతే మీరు ఇంజను ఆఫ్ చేసి మళ్ళి వెళ్ళే ముందు ఆన్ చెయ్యడం మంచి పద్దతి.

3.మీరు పనికిరాని బాటరీలను చెత్తకుండీలో పడేస్తారా? అలా చెయ్యకండి ఎందుకంటే అవి చెత్తలో కాలడం ద్వారా కాని నీటిలో కలవడం ద్వారా కాని విషవాయువులని గాలిలోనికి వదులుతాయి.ఇకనుండి అలా పడేయకుండా కొన్ని నెలలవరకు నిలువ ఉంచి మీకు తీరిక ఉన్నప్పుడు రీసైక్లింగ్ సదుపాయం ఉన్నచోట ఇచ్చిరండి లేదా రీచార్జబెల్ బాటరీలను వాడండి.

ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి,
మీరు ఇక్కడ చూడొచ్చు.

అందరికీ ధరిత్రీ దినోత్సవ శుబాకాంక్షలు!! >>

2 comments:

  1. మంచి పోస్ట్ ! మనల్ని కన్న అమ్మ కే కాదు మనల్ని మోసే అమ్మకూ మనం రుణపడి ఉన్నాం!ధరిత్రి సంరక్షణ కోసం మన కనీస కర్తవ్యాలని పాటిద్దాం.మీక్కూడా ధరిత్రీ దినోత్సవ శుబాకాంక్షలు!

    ReplyDelete
  2. పరిమళం గారు మీరన్నది నిజమండి, ధన్యవాదాలు.

    ReplyDelete