Thursday, April 30, 2009

స్వైన్ ఫ్లూ......No suspected case of swine flu in India


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంటువ్యాధి ప్రమాద స్థాయిని 5వ స్థానానికి పెంచింది. ప్రపంచవ్యాప్త అత్యంత తీవ్ర అంటువ్యాధి స్థానానికి కేవలం ఒకటే తక్కువ. కనీసం రెండు దేశాల్లో మనిషి నుంచి మనిషికి అంటువ్యాధి వ్యాపిస్తే అది 5వ స్థాయి కింద లెక్క. ఒక ఐదు సంవత్సరాల మెక్సికో చిన్నారి అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వ్యాధితో మరణించడంతో ప్రమాదస్థాయిని పెంచారు. వ్యాధి పుట్టిన మెక్సికో బయట ఇదే తొలి స్వైన్ ఫ్లూ మరణం. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మార్గరెట్‌ చాన్‌ మాట్లాడుతూ, వ్యాధి 5వ స్థాయికి చేరడమంటే అన్ని దేశాలు పూర్తిస్థాయిలో వ్యాధి నివారణకు సన్నద్ధంగా ఉండాలని సూచన అన్నారు. ఇది అన్ని దేశాల ప్రభుత్వాలకు, ఆరోగ్యశాఖలకు, ఫార్మా కంపెనీలకు, వ్యాపార, వాణిజ్య రంగాలకు తీవ్రస్థాయి హెచ్చరికగా పరిగణించాలని, ఆయా రంగాలు, శాఖలు సత్వరం తమ తమ విధుల్లో స్పందించాలని ఆదేశంగా వర్తిస్తుందని ఆమె ప్రకటించారు.

స్వైన్ ఫ్లూ నివారణకు ఆరోగ్యశాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కానీ వారి గమ్యస్ధానాలకు పంపించకూడదని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 148 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క అమెరికాలోనే 91కేసులున్నట్లు అమెరికాలోని వ్యాధుల నియంత్రణ-నివారణ కేంద్రం తెలిపింది. హెచ్‌1ఎన్‌1-2009గా పిలువబడుతున్న ఈ వ్యాధి జనించిన మెక్సికోలో ఐదు రోజులపాటు అన్ని రకాల పనులు, సేవలు రద్దు చేశారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఫెలిప్‌ కాల్డెరాన్‌ ప్రకటించారు.


హైదరాబాదులో స్వైన్ ఫ్లూ బాధితుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టెక్సాస్ నుంచి ఆ స్వైన్ ఫ్లూ బాధితుడు నగరానికి చేరుకున్నట్లు ఒక తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో హైదరాబాదులో కలకలం మొదలైంది.




1976 లోనే వచ్చిన ఈ స్వైన్ ఫ్లూ ఆడ్ చూడండి!!

నిర్లక్ష్యం చెస్తే ఏమవుతుందో, స్వైన్ ఫ్లూ ఒకరి నుండి ఒకరికి ఎలా పాకుతుందో ఇందులో చూపించారు.





ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారణ అయిన దేశాలు!! (ఇమేజ్ మీద క్లిక్ చెయ్యండి)














ఎక్కువగా భయపడాల్సిన అవసరంలేదని కొందరు అంటున్నారు.మిగతా వివరాలకోసం ఇక్కడ చూడండి Swnie Flu FAQ's.
మీకు స్వైన్ ఫ్లూ గురించి ఇంకా ఏమైనా తెలిసినట్టైతే మీ అభిప్రాయాలు పంచుకోగలరు.

2 comments:

  1. జాగ్రత్తగా ఉండాల్సిందే కానీ there's no need to panic. WHO వాళ్ల ఓవర్ యాక్షన్‌గురించి చెప్పేదేముంది. ఆసియా దేశాల్లో అంటువ్యాధులు ప్రబలి వేలాదిమంది హరీమన్నా వాళ్లకి చీమ కుట్టినట్లుండదు.

    ReplyDelete
  2. అబ్రకదబ్ర గారు మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే !! మంచి వార్త ఏంటంటే ఇండియాలో స్వైన్ ఫ్లూ లేదని WHO తేల్చిచెప్పింది.
    No suspected case of swine flu in India: WHO
    http://www.hindu.com/thehindu/holnus/000200904301608.htm

    ReplyDelete