నిన్న రాత్రి ఎదో ఆలొచిస్తుంటె హటాత్తుగ "నా డైరీ లొ ఓ పేజీ" అని శీర్షికన ఒక దినపత్రికలో ఓ పేజీ రాస్తె బాగుంటుందె అనిపించింది. ఇక ఆలస్యం చెయ్యటం ఎందుకని రెండో రొజే దినపత్రికలో ఆడ్ ఇచ్చేసాను. ఆ ఆడ్ సారంశమె ఇది.
ప్రపంచంలొ ఎందరో కొందరికి రొజూ డైరీ రాసే అలవాటు ఉంటుంది. మరికొందరికి అప్పుడప్పుడు రాసే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి ఎప్పుడో ఒకసారి ఆ సందర్భం గుర్తుంచుకొవాలనిపిస్తే ఎక్కడొ ఒకచోట రాసుకునే అలవాటు ఉంటుంది. అక్కడదాక ఎందుకండి ఈ మద్య సెల్ ఫొనుల్లొ రిమైండర్లు, ఈ-మెయిలల్లొ అలర్టులు ఇవన్ని గుర్తుపెట్టుకోవడానికి రాసుకునెవే కదా. ఐతే మీకు ఏ సందర్బంలోనైనా ఈ విషయం అందరితొ పంచుకుంటె బాగుంటుందె అనిపించిన క్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా మీ అనుభవాల్ని మాతో పంచుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం. మీ అనుభవాలు మాకు పాఠాలు కావచ్చు, వెంటనే కింద ఇచ్చిన చిరునామాకు "మీ డైరీ లో ఓ పేజీ ని" మాకు లేఖ రాసి పంపండి. ఈ-మెయిలు కూడా చెయ్యవచ్చు.
గమనిక:- మీ పేర్లు కాని మీ చిరునామాలు కాని మీ ఇష్టప్రకారమే ప్రచురించబడును.
నేను దినపత్రికలో ఇచ్చిన ఆడ్ కి ఎంతోమంది స్పందించారు, పొస్టు మాన్ ఉత్తరాల బస్తాలను మొయ్యలేక మోస్తూ ఇంటికి తెచ్చాడు. అవి చూసి ఆనదంతొ ఇక నా స్నెహితుల సహాయంతో ఒక్కొక్కటి చదివి మొత్తానికి ఫిల్టరు చేసాను. ఆ ఉత్తరాలు చూస్తుంటే ఒక పుస్తకం ప్రచురించొచ్చు అనుకున్నాను. అలా దినపత్రిక లొ ప్రచురితమై కొద్దిరోజుల్లోనే విశేష ఆదరణ పొందింది ఈ "నా డైరీ లొ ఓ పేజీ".
ఆగండాగండి ఇదంతా నిన్న రాత్రి పడుకునేముందు నాకు వచ్చిన ఆలొచన, పడుకున్నాక కంటిన్యు అయిన కల అంతే. దాన్ని ఉదయాన్నె నా డైరీలో రాసేశా(నేను డైరీ ఎప్పుడోఒకసారి,అదీ ఉదయాన్నె రాస్తానండొయ్). కనీసం ఈ రకంగానైన మీతో పంచుకొని నా కల నిజమయ్యిందని సంతొషపడదామని!!
మిమ్మల్ని బోరుకొట్టించకుండా ఉంటే ఇలాంటి పేజీతోనే మళ్ళి కలుస్తాను, అంతవరకు సెలవు.
Saturday, July 19, 2008
Thursday, July 17, 2008
నాతొ(లి) కవిత రాయించిన మా పి.యి.టి క్లాసులు!!
అవి మేము నవోదయాలొ ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులు. ఉదయం అయ్యిందా పరుగోపరుగు తెల్లవారుజామునే లేవాలి, మొహం కడుక్కొని 5:00 గంటలకల్ల గ్రౌండ్ లొ ఉండాలి. గ్రౌండ్ కెదురుగా కూర్చొడానికి ప్లేసు ఉండేది. ఒకోసారి పి.యి.టి సర్ కాని మేడం కాని లేటుగ వస్తె అక్కడ రౌండుటేబులు సమవేశాలు జరిగెవి(కబుర్లు లెండి). సార్ వస్తేగాని అక్కడినుండి లేచెవాళ్ళుకాదు. అందరు వచ్చాక టైముకి అటెండెన్సు తీసుకునేవాళ్ళు. ఎవరైన మిస్సయ్యార అయిపొయారె, రూం రూంకి వెళ్ళి మరీ వెతుకుతారు(వాళ్ళకి పనీష్మెంట్ పాపం). అందుకె మేడం వస్తె మా ఫేసులన్ని మాడిపొయేవి. అటెండెన్సు అవ్వగానె రన్నింగు మొదలు, ఎక్కడ ఆగకూడదు. మావాళ్ళేమైన తక్కువ తిన్నార, రన్నింగు అంటే చాలు , మోకాలుకి దెబ్బ లేకున్న వున్నట్టుగ నడవడం, లేకపొతె రన్నింగు మద్యలొ షు లేసులు ఊడాయని ఆ రౌండు తప్పించుకోటం చెసేవాళ్ళు.అందరు అలా చెయ్యరండోయ్ కొందరే. కవిత అనె మాటె లేకుండ ఎదేదొ చెప్తున్నాననుకుంటున్నార, ఆలస్యం చెయ్యకుండ ఇక అసలు విషయంలొకి వస్తాను. ఎప్పటిలాగానె జాగింగు మొదలయ్యింది, నేను ఎప్పుడు ప్రాసల గురించి ఆలొచిస్తుంటాలెండి, అలా ఆలొచిస్తుంటె నాకు ఒక నాలుగు లైన్లు తట్టాయి. అవి ఏమిటంటే
"ఉదయాన్నె మొదలయ్యే రేసులు
మాటిమాటికి ఊడే లేసులు
సార్ వస్తే గాని ఖాలిగాని ప్లేసులు
మేడం వస్తె మాడిపోయె ఫేసులు
మా పి.యి.టి క్లాసులు"
అలా నాతో నా తొలి కవితని రాయించాయి మా పి.యి.టి క్లాసులు!! దానికి వెంటనె "మా పి.యి.టి క్లాసులు" అని పేరు కూడా పెట్టేసా. బాగుందా? మళ్ళి ఇంకొక సంఘటనతొ మీకు నచ్చితే ఇంకో రోజు కలుద్దాం. అప్పటిదాక సెలవు.
"ఉదయాన్నె మొదలయ్యే రేసులు
మాటిమాటికి ఊడే లేసులు
సార్ వస్తే గాని ఖాలిగాని ప్లేసులు
మేడం వస్తె మాడిపోయె ఫేసులు
మా పి.యి.టి క్లాసులు"
అలా నాతో నా తొలి కవితని రాయించాయి మా పి.యి.టి క్లాసులు!! దానికి వెంటనె "మా పి.యి.టి క్లాసులు" అని పేరు కూడా పెట్టేసా. బాగుందా? మళ్ళి ఇంకొక సంఘటనతొ మీకు నచ్చితే ఇంకో రోజు కలుద్దాం. అప్పటిదాక సెలవు.
హమ్మయ్య దొరికేసారు!!
ఇంతకి ఎవరు దొరికేసింది? అనుకుంటున్నారా, ఎవరో కాదండి మీరే ఎందుకంటె ఇకనుండి నేను రాసే బ్లాగులను చదవాల్సిన వారు మీరే కదా. నిన్ననే నా స్నేహితుడి సహాయంతొ వీటిని గూర్చి తెలుసుకున్నాను. ఇది నా రెండొ బ్లాగు.ఇక నేను రాయబొయె బ్లాగులు మీకు బోరనిపించినా, విసుగుతెప్పించిన, అచ్చుతప్పులు దొరలిన ముందుగానె మన్నించండి.
(సరదాకి) సూచన:- నేను రాసె బ్లాగులు చదివిన తర్వత, జరిగే అనర్దాలకు నేను బాద్యత వహించను.
(సరదాకి) సూచన:- నేను రాసె బ్లాగులు చదివిన తర్వత, జరిగే అనర్దాలకు నేను బాద్యత వహించను.
మరి మీరేమంటారు?
"సమాజం అంటే ఈ మనుషుల సమూహమె కదా, కాబట్టి మనిషి తనకుతానె పరిసరాల ప్రభావాన్ని బట్టి మసలుకుంటూ తనను తాను రక్షించుకోవాలి" అంటాడు మరో శాస్త్రవేత్త జె.బి.ఎస్ హల్డెన్
మరి మీరేమంటారు?
Subscribe to:
Posts (Atom)