Thursday, July 17, 2008

నాతొ(లి) కవిత రాయించిన మా పి.యి.టి క్లాసులు!!

అవి మేము నవోదయాలొ ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులు. ఉదయం అయ్యిందా పరుగోపరుగు తెల్లవారుజామునే లేవాలి, మొహం కడుక్కొని 5:00 గంటలకల్ల గ్రౌండ్ లొ ఉండాలి. గ్రౌండ్ కెదురుగా కూర్చొడానికి ప్లేసు ఉండేది. ఒకోసారి పి.యి.టి సర్ కాని మేడం కాని లేటుగ వస్తె అక్కడ రౌండుటేబులు సమవేశాలు జరిగెవి(కబుర్లు లెండి). సార్ వస్తేగాని అక్కడినుండి లేచెవాళ్ళుకాదు. అందరు వచ్చాక టైముకి అటెండెన్సు తీసుకునేవాళ్ళు. ఎవరైన మిస్సయ్యార అయిపొయారె, రూం రూంకి వెళ్ళి మరీ వెతుకుతారు(వాళ్ళకి పనీష్మెంట్ పాపం). అందుకె మేడం వస్తె మా ఫేసులన్ని మాడిపొయేవి. అటెండెన్సు అవ్వగానె రన్నింగు మొదలు, ఎక్కడ ఆగకూడదు. మావాళ్ళేమైన తక్కువ తిన్నార, రన్నింగు అంటే చాలు , మోకాలుకి దెబ్బ లేకున్న వున్నట్టుగ నడవడం, లేకపొతె రన్నింగు మద్యలొ షు లేసులు ఊడాయని ఆ రౌండు తప్పించుకోటం చెసేవాళ్ళు.అందరు అలా చెయ్యరండోయ్ కొందరే. కవిత అనె మాటె లేకుండ ఎదేదొ చెప్తున్నాననుకుంటున్నార, ఆలస్యం చెయ్యకుండ ఇక అసలు విషయంలొకి వస్తాను. ఎప్పటిలాగానె జాగింగు మొదలయ్యింది, నేను ఎప్పుడు ప్రాసల గురించి ఆలొచిస్తుంటాలెండి, అలా ఆలొచిస్తుంటె నాకు ఒక నాలుగు లైన్లు తట్టాయి. అవి ఏమిటంటే

"ఉదయాన్నె మొదలయ్యే రేసులు
మాటిమాటికి ఊడే లేసులు
సార్ వస్తే గాని ఖాలిగాని ప్లేసులు
మేడం వస్తె మాడిపోయె ఫేసులు
మా పి.యి.టి క్లాసులు"

అలా నాతో నా తొలి కవితని రాయించాయి మా పి.యి.టి క్లాసులు!! దానికి వెంటనె "మా పి.యి.టి క్లాసులు" అని పేరు కూడా పెట్టేసా. బాగుందా? మళ్ళి ఇంకొక సంఘటనతొ మీకు నచ్చితే ఇంకో రోజు కలుద్దాం. అప్పటిదాక సెలవు.

19 comments:

 1. బాగుంది... అయితే ఇలా చాలా కవితలు వ్రాశారనుకుంటా :)
  బ్లాగ్లోకానికి స్వాగతం !!!!

  ReplyDelete
 2. బాగు౦ద౦డి .....

  నాకు ఇలా౦టి అనుభవ౦ ఒకటి వు౦ది ....

  కాలెజి కి హాస్టల్ 5 కిలొ మిటర్ల దూర౦ వు౦డెది ...మాకు 2 కాలెజి బస్సులు వు౦డెవి ...అ౦దులొ చిన్న బస్సు లొ పాటలు పెట్టెవారు ....కాని మా హాస్టల్ ఇన్ చార్జ్ బస్సు లొ పాటలు పెట్టడానికి ఒప్పుకొనె వాడు కాదు ...అ౦దరిని ...గూబె (అర్థ౦ తెలీదు) అని తిడుతూ వు౦డె వాడు ...నేను ఈ స౦దర్భ్హ౦ లొ ఒక కవిత వ్రాసాను ....

  చోట బస్సు లో వినాలి పాట..
  అదే మాకు ర౦గుల తోట..
  అదే మాకు పస౦దైన బాట..
  కాని ఇ౦దుకు ఒకడు అడ్డు పడుతున్నాడట..
  త్వరలొ ఒలుస్తామట ..వాడి తాట...

  ఆయన తాట ఒలవడ౦ ఎమో గాని ...ఇది ఆయనకు దొరకడ౦ రాసి౦ది నేను అని తెలవడ౦ ..నా తాట ఒలవడ౦ జరిగి పొయాయి ( జస్ట్ మ౦దలి౦చి ప౦పాడు అ౦తె ...నమ్మ౦డి...)

  ReplyDelete
 3. బావుంది.. :)
  ఇలాంటప్పుడు నేను సొంతంగా కవితలు ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ, పేరడీలు మాత్రం చాలా చెప్పేదాన్ని...!

  ReplyDelete
 4. బహుశ
  సృజనాత్మకత అలానే ప్రారంభమౌతుందేమో

  ReplyDelete
 5. బాగుంది.
  మీరూ నవోదయానేనా...మనమూ ఆబాపతే చిత్తూరు లో చదివి మైగ్రేషన్ మీద హర్యానా వెళ్ళి తరువాత మినిమైగ్రేషన్ లో లేపాక్షి(అనంతపురం)లో చదివా.మీరు?

  ReplyDelete
 6. మీరు తు.గో. నవోదయానా?

  ReplyDelete
 7. అందరికి ధన్యవాదములు!! నన్ను ఇంతగా ఆహ్వనిస్తారిని అనుకోలెదండి, చాలా సంతొషం గ ఉంది.

  ReplyDelete
 8. నేను చదివింది పాలేరు నవోదయా లొ నండి, ఖమ్మం జిల్లా. మేధగారు మాకు మీ పేరడీలను చదివే అదృష్టాన్ని కల్పించండి. Shankar reddy గారు మీ అనుభవం బాగుంది!!

  ReplyDelete
 9. అలాగా..నేను ఖమ్మంలో రెండు సంవత్సరాలు పనిచేసా!

  ReplyDelete
 10. జిల్లాలు వేరైనా అన్ని నవోదయాల తీరు ఒకటేనన్నమాట. నేను 2 ఏళ్ళు విజయనగరంలో వెలగబెట్టా. నాకు గృహరోగం(అదే హోం సిక్) ఎక్కువ, ప్రతీ ఆదివారం నాకోసం రావటం కన్నా నన్నే తీసుకుపోయి ఊర్లో చదివించటం మంచిదని మా వాళ్ళు 2 ఏళ్ళ తరువాత గ్రహించారు.

  మేము కూడా మార్నింగ్ జాగింగ్ లో షూ లేసు నాటకాలు, కడుపు నొప్పి నాటకాలు చాలా చేసాం. లేదా రూం స్వీపింగ్ అని చెప్పి జాగింగ్ మానేసి పడుకొనే వాళ్ళం.
  బ్లాగులోకానికి స్వాగతం.

  ReplyDelete
 11. మరిన్ని మంచి కవితలు ,టపాలు ఆశిస్తున్నాం.

  ReplyDelete
 12. తప్పకుండా murali గారు, Thanks!!

  ReplyDelete
 13. కుమ్మేస్తున్నావుగా ! బాగుంది .,మరి మాకు ఎప్పుడూ చ్చెప్పలేదు!

  ReplyDelete
 14. బాగా వ్రాస్తున్నారు.కామెంట్సులో పేర్ల రంగు మార్చండి.సరిగా కనిపించడం లేదు.బ్లాగ్లోకానికి స్వాగతం.
  word verification తీసివెయ్యండి.

  ReplyDelete
 15. నరసింహ గారు, మీరు చెప్పినట్టె మార్చానండి. Thanks

  ReplyDelete
 16. మీ తొలి కవిత ఆ కవిత నేపధ్యం రెండు బావున్నాయి.

  ReplyDelete